English   

కరోనా పాజిటివ్..చెప్పకుండానే సినిమా నుండి తీశేశారంటూ ఆదర్శ్ ఎమోషనల్

Adarsh Balakrishna
2021-04-17 17:43:28

నటుడు బిగ్ బాస్ 1 తెలుగు కంటెస్టెంట్ ఆదర్శ్ బాలకృష్ణ కరోనా బారిన పడ్డారు. ఆదర్శ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు సైతం కరోనా పాజిటివ్ వచ్చింది..ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే తాజాగా ఆదర్శ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ లో ఆదర్శ్ తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని పంచుకున్నారు. తనకు తన ఫ్యామిలీకి కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పారు. అయితే ఈ విషయం ప్రస్తుతం తాను నటిస్తున్న సినిమా బృందానికి చెప్పానని..అయితే వాళ్ళు కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా మరో నటుడిని తీసుకున్నారని అన్నారు. 

నటుల జీవితాలు అంతే అంటు పోస్ట్ పెట్టారు. అంతే కాకుండా అదే జీవితమంటే అంటూ పాజిటివ్ కామెంట్ తో తన పోస్ట్ ను పూర్తి చేశారు. కరోనా లాక్ డౌన్ కారణంగా ఇప్పటికే నటీనటులు ఎన్నో ఇబ్బందులు ఎదురుకున్నారు. షూటింగ్ లు లేకపోవటం తో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారు. ఇక ఇటీవలే షూటింగ్ లు తిరిగి స్టార్ట్ అవ్వగా మళ్ళీ కరోనా మహమారి పంజా విసురుతోంది. దాంతో ఇప్పటికే కష్టాల్లో ఉన్న నటులపై మళ్ళీ ప్రభావం పడుతోంది. ఇలాంటి సమయం లో ఇలా సినిమా నుండి తీసేయడం బాధాకరం. టాలీవుడ్ నిర్మాతలు దర్శకులు   ఈ విషయంపై కాస్త ఆలోచించాలి.

More Related Stories