English   

ఫైన‌ల్ షెడ్యూల్ లో నాని శ్యామ్ సింగ‌రాయ్

Shyam Singha Roy
2021-04-19 11:50:02

న్యాచురల్‌ స్టార్‌ నాని కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం ‘శ్యామ్‌ సింగ రాయ్‌’. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.  ఈ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ ఆడియన్స్‌లో సినిమా పట్ల మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తూ అటు ఇండస్ట్రీలోనూ ఇటు ప్రేక్షకుల్లోనూ అంచనాలను భారీగా పెంచేసింది.

తాజాగా ఈ సినిమా కోసం ఆర్ట్‌ డైరెక్టర్‌ అవినాష్‌ కొల్ల..కోల్‌కతాను త‌ల‌పించే భారీ సెట్‌ను హైదరాబాద్‌లో రీ క్రియేట్‌ చేశారు. ఆరున్నర కోట్ల భారీ బడ్జెట్‌తో ప‌ది ఎక‌రాల్లో నిర్మించిన ఈ భారీ సెట్‌లో ఫైన‌ల్ షెడ్యూల్ షూటింగ్ జ‌రుగుతోంది. హీరో నాని స‌హా ముఖ్యతారాగణంపై ప‌లు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.  రేపు థియేట‌ర్‌ల‌లో ఈ స‌న్నివేశాలు సినీ ప్రియుల‌కి ఒక  కొత్త అనుభూతిని పంచ‌నున్నాయ‌ని చిత్ర యూనిట్ తెలిపింది. 

ద‌ర్శ‌కుడు రాహుల్‌ సంకృత్యాన్‌ ఓ యూనిక్‌ కాన్సెప్ట్‌తో  ‘శ్యామ్‌సింగ రాయ్‌’  చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాలో త‌న గ‌త చిత్రాల‌కు భిన్న‌మైన స‌రికొత్త గెట‌ప్స్‌ల‌లో నేచుర‌ల్ స్టార్ నాని క‌నిపించ‌నున్నారు. 

సాయిపల్లవి, కృతిశెట్టి, మడోనా సెబాస్టియన్ ముగ్గురు బ్యూటిఫుల్ హీరోయిన్స్ న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని ప్ర‌తిభావంతులైన సాంకేతిక నిపుణులతో ఎక్కడ రాజీ పడకుండా నిర్మాత వెంకట్‌ బోయనపల్లి రూపొందిస్తున్నారు. 

More Related Stories