English   

పూరి నితిన్ కాంబినేషన్ ఫిక్స్

Puri Jagannath
2021-04-19 12:26:35

డాషింగ్ డైరెక్ట్ పూరీ జగన్నాథ్ ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో "లైగర్" అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ బాక్సర్ గా కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబై లో జరుగుతుండగా కరోనా ఎఫెక్ట్ తో షూటింగ్ కు బ్రేక్ పడింది. దాంతో చిత్ర యూనిట్ తిరిగి హైదరాబాద్ కు చేరుకుంది. ఈ చిత్రాన్ని ఛార్మి కౌర్ మరియు కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

ఇదిలా ఉండగా పూరీ జగన్నాథ్ తరవాత సినిమాను నితిన్ తో చేయబోతున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ సినిమాలో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నట్టు సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలుబడలేదు. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉన్నట్టు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే పూరి నితిన్ కాంబినేషన్ లో "హార్ట్ ఎటాక్" సినిమా వచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈసారి మాత్రం పూరీ నితిన్ కు సూపర్ హిట్ ఇవ్వాలని అనుకుంటున్నారట.

More Related Stories