English   

రవితేజ సినిమాపై కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్

 Ravi Teja
2021-04-19 13:35:27

టాలీవుడ్ పై కరోనా ప్రభావం కనిపిస్తోంది. విడుదల తేదీలను అనౌన్స్ చేసిన పెద్ద పెద్ద సినిమాలు సడెన్ గా విడుదలను వాయిదా వేసుకున్నాయి. అంతే కాకుండా ఇప్పటికే పలు సినిమా షూటింగ్ లకు కూడా బ్రేక్ పడింది. ఇక తాజాగా  మాస్ మహరాజ్ రవితేజ నటిస్తున్న సినిమా పై కూడా కరోనా ఎఫెక్ట్ పడినట్టు తెలుస్తోంది. 

రవితేజ ప్రస్తుతం ఖిలాడి సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు కరోనా విజృంభన నేపథ్యంలో బ్రేక్ పడింది. ఇదిలా ఉండగానే రవితేజ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. శరత్ మండవని దర్శకత్వంలో సినిమా చేసేందుకు రవితేజ ఒప్పుకున్నారు. అంతే కాకుండా ఈ సినిమా పూజ కార్యక్రమాలను కూడా పూర్తి చేశారు. 

అయితే ఈరోజు నుండి సినిమా షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో షూటింగ్ వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా వచ్చే నెలలో సినిమా షూటింగ్ కు ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే రవితేజ తో పాటు ఇతర యూనిట్ సభ్యులు డేట్ లను కూడా మార్చేసారట. ఇక ఈ సినిమా షూటింగ్ వాయిదా పడినప్పటికీ రవితేజ ఇతర ప్రాజెక్టులలో నటించకుండా పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నట్టు సమాచారం.

More Related Stories