English   

అంటే సుంద‌రానికీ షూటింగ్‌లో నజ్రియా నజీమ్ 

Nazriya Nazim
2021-04-19 14:25:27

నేచురల్ స్టార్ నాని  హీరోగా న‌టిస్తోన్న 28వ చిత్రం `అంటే  సుందరానికీ..` వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం ద్వారా న‌జ్రియా న‌జీమ్ తెలుగులో హీరోయిన్ గా ప‌రిచ‌య‌మ‌వుతుంది. `రాజా రాణి` వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన న‌జ్రియా  ఈ రోజు నుండి `అంటే సుంద‌రానికీ` మూవీ షూటింగ్ లో పాల్గొటోంది. హైద‌రాబాద్‌ లో జ‌రుగుతోన్న ఈ షెడ్యూల్‌లో న‌జ్రియా స‌హా ఇతర కీల‌క తారాగ‌ణంపై స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. ‌

ఈ సంద‌ర్భంగా హీరోయిన్ న‌జ్రియా న‌జీమ్  `నా ఫ‌స్ట్ తెలుగు మూవీకోసం చాలా ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తున్నాను. ఈ రోజు నా తొలి తెలుగు సినిమా షూటింగ్‌ను మొదలు పెట్టాను. ఫ‌స్ట్‌ చేసే పని ఏదైనా స్పెషల్‌గా ఉంటుంది. కాబట్టి ‘అంటే సుందరానికీ’  నాకు చాలా స్పెషల్‌”  అని పోస్ట్ చేసింది. 

ఒరిజిన‌ల్ స్టోరీతో ఒక మ్యూజిక‌ల్ రోమ్-‌కామ్ గా తెర‌కెక్కుతోన్న `అంటే సుంద‌రానికీ` చిత్రంలోకి న‌జ్రియా న‌జీమ్‌ను ఆహ్వానించింది చిత్ర యూనిట్‌‌. ఈ సంద‌ర్భంగా మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మాత‌లు మాట్లాడుతూ - ``మా టీమ్ త‌రుపున అంటే సుంద‌రానికీ చిత్రంలోకి న‌జ్రియా న‌జీమ్‌ను స్వాగ‌తిస్తున్నాం. త‌న‌కి, మ‌రియు మా టీమ్ అంద‌రికీ ఈ చిత్రం త‌ప్ప‌కుండా ప్ర‌త్యేకంగా ఉంటుంది`` అని అన్నారు. 

More Related Stories