English   

వైష్ణ‌వ్ తేజ్ తో మైత్రీ బిగ్ డీల్

 Vaishnav Tej
2021-04-19 14:55:10

ఉప్పెన సినిమాతో టాలీవుడ్ కు ప‌రిచ‌య‌మైన మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ ప్ర‌స్తుతం వ‌రుస ఆఫ‌ర్ల‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్ప‌టికే వైష్ణ‌వ్ తేజ్ క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాను మొద‌లుపెట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉంది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో పూర్తి కావాల్సి ఉంది కానీ క‌రోనా వ‌ల్ల ఆల‌స్యం అయింది. దీంతో పాటు ఉప్పెన సినిమా త‌ర‌వాత వైష్ణ‌వ్ గిరీష‌య్య ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాను మొద‌లు పెట్టాడు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అయితే వైష్ణ‌వ్ తేజ్ తో మొద‌టి సినిమాను తీసిన మైత్రీమూవీమేక‌ర్స్ వారు అత‌డితో మ‌రో రెండు సినిమాను నిర్మించేందుకు డీల్ కుదుర్చుకున్నార‌ట‌. 

ఉప్పెన సినిమాతో మైత్రీకి ఫుల్ గా లాభాలు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.  ఈ నేప‌థ్యంలోనే వ‌రుస‌గా మ‌రో రెండు సినిమాలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నార‌ట‌. అంతే కాకుండా ఈ రెండు సినిమాల‌కు కూడా సుకుమార్ ర‌చ‌న స‌హ‌కారంతో పాటు స‌హ‌నిర్మాత‌గా గా కూడా ఉండ‌బోతున్న‌ట్టు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇక సుకుమార్ ఉండటం తో వైష్ణ‌వ్ కూడా మైత్రీ వారి డీల్ కు ఓకే చెప్పిన‌ట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ రెండు సినిమాల‌కు గానూ వైష్ణ‌వ్ తేజ్ ప‌ది కోట్ల వ‌ర‌కూ తీసుకోబోతున్నాడ‌ట‌. అంతే కాకుండా సినిమా విడుద‌ల త‌ర‌వాత లాభాల్లో వాటా ఇచ్చేందుకు కూడా మైత్రీ వారు ఒప్పుకున్నార‌ట‌.

More Related Stories