English   

రౌడీ హీరో చేతుల మీదుగా గ‌ల్లీ రౌడీ టీజ‌ర్ విడుద‌ల‌

 Gully Rowdy
2021-04-19 17:55:39

సందీప్ కిష‌న్ న‌టిస్తున్న తాజా చిత్రం గ‌ల్లీ రౌడీ. ఈ చిత్రానికి నాగేశ్వ‌ర రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సందీప్ కిష‌న్ కు జోడీగా నేహాశెట్టి హీరోయిన్ గా న‌టిస్తోంది. ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అంతే కాకుండా చౌర‌స్తా రామ్ ఈ చిత్రానికి స్వ‌రాలు సమ‌కూరస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ న‌టుడు విజ‌య్ సేతుప‌తి నటించిన సినిమాకు రీమేక్ గా తెర‌కెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉండ‌గా ఈ సినిమా టీజ‌ర్ ను  విజ‌య్ దేవ‌ర‌కొండ చేతుల మీదుగా విడుద‌ల చేశారు. 

ఇక ఈ సినిమా పేరులో రౌడీ ఉన్న‌ప్ప‌టికీ టీజ‌ర్ ఆద్యంతం వినోదభ‌రితంగా ఉంది. వెన్నెల కిషోర్ మ‌రియు రాజేంద్ర‌ప్ర‌సాద్ లు సినిమా కామెడీని పండిస్తార‌ని అర్థం అవుతోంది. కుంటుంబం క‌న్న కొడుకును రౌడీని చేయాల‌నుకోవ‌డం అనే కొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమా రాబోతుంది.  అంతే  కాకుండా హీరో హీరోయిన్ ల మ‌ధ్య రొమాంటిక్ స‌న్నివేశాలు కూడా ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. చౌర‌స్తా రామ్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆక‌ట్టుకునేలా ఉంది. ఇక  ఇటీవ‌లే విడుద‌లైన ఎ1 ఎక్స్ప్రెస్ తో నిరాశ‌ర్చిన సందీప్ కిష‌న్ కు ఈ సినిమా ఎలాంటి విజ‌యాన్ని ఇస్తుందో చూడాలి. 

More Related Stories