చెల్లి అంటూనే మైనర్ ను గర్భవతిని చేసిన టిక్ టాక్ భార్గవ్

టిక్ టాక్ వచ్చిన తర్వాత ఎంతో మంది పాపులర్ అయ్యారు. అలా పాపులారిటీ సంపాదించిన వారిలో టిక్ టాక్ భార్గవ్ కూడా ఒకరు. భార్గవ్ ఫన్ బకెట్ అనే యూట్యూబ్ ఛానల్ లోనూ పలు ఫన్నీ విడీయోలు చేస్తుంటారు. ఇక ఇతగాడు చేసిన వీడియోల్లో కొన్ని వీడియోలు వైరల్ అవ్వడంతో పలువురు సెలబ్రెటీలతో కూడా కలిసి వీడియోలు చేశాడు. ఇక ఇప్పుడు తాజాగా ఈ సెలబ్రెటీ ఓ గణకార్యం చేసి కటకటాల పాలయ్యాడు.
కొత్త వలస ప్రాంతానికి చెందిన భార్గవ్ కు అదే ప్రాంతానికి చెందిన ఓ బాలికతో పరిచయం ఏర్పడింది. టిక్ టాక్ వీడియోలపై ఉన్న మోజుతో బాలిక బార్గవ్ తో కలిసి టిక్ టాక్ లో వీడియోలు చేసింది. ఇక వీరిద్దరూ అన్నా చెల్లి అని పిలుచుకోవడంతో బాలిక తల్లి కూడా పట్టించుకోలేదు. అయితే భార్గవ్ అయ్యాయితో ఉన్న పరిచయాన్ని చనువుగా తీసుకున్నాడు. మాయ మాటలు చెప్పి బుట్టలో వేసుకున్నాడు.
అంతే కాకుండా లేని పోని మాటలు చెప్పి గర్భవతిని చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం బాలిక నాలుగు నెలల గర్భవతి అని గ్రహించిన ఆమె తల్లి పెందుర్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటన పై కేసు నమోదుచేసుకున్న పోలీసులు భార్గవ్ ను అదుపులోకి తీసుకున్నారు. అంతే కాకుండా దిశ చట్టం కింద కేసు నమోదుచేసి రిమాండ్ కు తరలించారు.