English   

క‌రోనా ఉధృతి..తెలంగాణ‌లో నైట్ క‌ర్ఫ్యూ

 Telangana
2021-04-20 12:09:13

క‌రోనా మ‌హ‌మ్మారి ఉధృతి దృష్ట్యా జనసంచారం తగ్గించేందుకు  తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.  రాత్రి 9 గంట‌ల నుంచి ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు నైట్ క‌ర్ఫ్యూను  అమ‌ల్లోకి తీసుకు వచ్చింది. నేటి నుంచి మే 1 వరకు నైట్‌ కర్ఫ్యూ నిబంధనలు అమల్లో ఉంటాయని తెలిపింది. క‌ర్ఫ్యూ నుంచి అత్య‌వ‌స‌ర స‌ర్వీసులు, పెట్రోల్ బంక్‌లు, మీడియాకు మిన‌హాయింపు ఇచ్చారు. ఇక రాత్రి 8 గంటల వరకే బార్లు, రెస్టారెంట్లు, థియేటర్స్‌ నిర్వహణకు అనుమతినిచ్చింది.

గడిచిన 24 గంటల్లో 5,926 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌లో తెలిపింది. తాజాగా మహమ్మారి బారినపడి 18 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 2,209 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారు. మరో వైపు రాష్ట్రంలో యాక్టివ్‌ కేసులు 42వేలు దాటాయి. 
 

More Related Stories