English   

బాలయ్య తో అనిల్ రావిపూడి సినిమా ఫిక్స్

Balakrishna
2021-04-20 15:16:13

నటసింహం నందమూరి బాలకృష్ణ యంగ్ డైరెక్టర్ అనిల్ రావి పూడి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమా కన్ఫామ్ అయినట్టు సమాచారం. ముందుగా అనిల్ మహేష్ బాబు తో మరో సినిమా సినిమా తీయాలనుకున్నారు. మహేష్ బాబు కు కథ కూడా వినిపించగా ఆయన ఒకే చెప్పారు. అయితే మధ్యలో త్రివిక్రమ్ మహేష్ సినిమా ఫిక్స్ అయింది. దాంతో అనిల్ రావిపూడి బాలయ్యకు కథను వినిపించారు. అనిల్ వినిపించిన పక్కా మాస్ కథ బాలయ్య కు కూడా నచ్చేసింది.  దాంతో ఈ సినిమాకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. 

ఇక ఈ సినిమా వచ్చే ఏడాది ప్రారంభంలో సెట్స్ పై వెళ్లబోతుందట. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మిస్తారట. అనిల్ రావిపూడి నిర్మాతగా వ్యవహరించిన గాలి సంపత్ సినిమాను కూడా ఈ బ్యానర్ పైనే తెరకెక్కించారు. అంతే కాకుండా నాని హీరోగా నటిస్తున్న టక్ జగదీశ్ చిత్రాన్ని కూడా ఈ బ్యానర్ పైనే నిర్మిస్తున్నారు. ఇక బాలయ్య అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఎలాంటి మాస్ మసాలా మూవీ వస్తుందో చూడాలి.

More Related Stories