English   

స‌లార్ లో జ‌ర్న‌లిస్ట్ గా శృతి హాస‌న్

Shruti Haasan
2021-04-21 10:24:17

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం కేజీఎఫ్ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో స‌లార్ చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ భారీ బ‌డ్జెట్  చిత్రాన్ని హోంబ‌లే ఫిలిం బ్యాన‌ర్ పై నిర్మిస్తున్నారు. ర‌విబ‌సురూర్ ఈ సినిమాకు స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్నారు. ఇక ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉంది. ఈ చిత్రంలో ప్ర‌భాస్ ప‌క్క‌న హీరోయిన్ గా శృతి హాస‌న్ న‌టిస్తోంది. ప్ర‌భాస్ శృతిహాస‌న్ క‌లిసి న‌టించ‌డం ఇదే మొద‌టి సారి కావ‌డం విశేషం. అయితే ఈ సినిమా గురించి కొన్ని ఆస‌క్తికర వార్త‌లు ఇప్పుడు ఫిల్మ్ న‌గ‌ర్ లో చెక్క‌ర్లు కొడుతున్నాయి. 

ఈ సినిమాలో శృతి హాస‌న్ జ‌ర్న‌లిస్ట్ గా క‌నిపించ‌బోతుంద‌ట‌. అంతే కాకుండా ఈ సినిమాలో శృతి హాస‌న్ రోల్ ను ఓ రియ‌ల్ లైఫ్ జ‌ర్న‌లిస్ట్ ను ఆధారంగా తీసుకుని తెర‌కెక్కిస్తున్నాట‌. మ‌రోవైపు ఈ సినిమాలో ప్ర‌భాస్ మెకానిక్ పాత్ర‌లో కనిపించ‌బోతున్నారని కూడా ఫిల్మ్ న‌గ‌ర్ లో టాక్ వినిపిస్తోంది. ఇక గోదావ‌రిఖని బొగ్గు గ‌నుల్లో షూటింగ్ లో శృతి హాస‌న్ ప్రభాస్ మ‌ధ్య కీల‌క స‌న్నివేశాల‌ను తెర‌కెక్కించారు. ఆ సమ‌యంలో లీక్ అయిన కొన్ని ఫోటోలు కూడా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. స‌లార్ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుని 2022 ఎప్రిల్ లో విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు చిత్ర యూనిట్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. 

More Related Stories