English   

వకీల్‌సాబ్ పై సుప్రీం మాజీ జడ్జ్  ప్రశంసల వర్షం

Vakeel Saab
2021-04-21 10:58:58

భారీ అంచనాల నడుమ విడుదలైన పవర్‌స్టార్  వకీల్‌సాబ్ సూపర్ హిట్ టాక్‌ సొంతం చేసుకుంది. అభిమానుల మనస్సు దోచుకున్న ఈ సినిమా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది.  తాజాగా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి గోపాలగౌడ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. వకీల్‌సాబ్ చూసిన ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. వకీల్‌సాబ్ చరిత్రలో నిలిచిపోయే సినిమా అంటూ ఆయన కితాబిచ్చారు. ఇక కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలిచే లాయర్ పాత్రలో పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నటించలేదని.. ఆయన జీవించారని అన్నారు. చరిత్రాత్మక చిత్రం ‘దేవదాస్’లో ఓ స్త్రీ పురుషుని మధ్య ఉన్న ప్రేమని ఓ కొత్త కోణంలో ఆవిష్కరించారని అందుకే అది భారతదేశ చరిత్రలోనే ఒక అత్యుత్తమ కావ్యంగా నిలిచిపోయిందని ఆయన పేర్కొన్నారు.

మళ్లీ ఇన్నాళ్లకు ప్రపంచవ్యాప్తంగా మధ్య తరగతి మహిళల పట్ల జరుగుతున్న అరాచాకాలపై న్యాయపోరాటంపై ‘వకీల్‌సాబ్’ సినిమా వచ్చిందన్నారు. సాధారణంగా ఇలాంటి సందేశాత్మక సినిమాలు చేసేందుకు యువ మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు చేయరన్న ఆయన.. కానీ, పవన్ కళ్యాణ్ తన ఇమేజీని పక్కన పెట్టి ఈ సినిమా చేశారన్నారు. అందుకే దేశవ్యాప్తంగా ఉన్న అగ్రనటులే కాకుండా ప్రపంచస్థాయి నటుల నుంచి కూడా ప్రశంసలు వచ్చాయని పేర్కొన్నారు. అందుకే వకీల్‌సాబ్ సినిమా ఒక అత్యుత్తమ చలన చిత్రంగా ప్రపంచస్థాయిలో చిరస్థాయిలో నిలిచిపోతుందని ఆయన అన్నారు.

More Related Stories