English   

టిక్‌టాక్‌ భార్గవ్‌ కేసు..ఓ మైగాడ్ నిత్య క్లారిటీ

omygod nithya
2021-04-21 11:16:36

టిక్‌టాక్‌ ఫేమ్ ఫన్‌ బకెట్‌ భార్గవ్ 14 ఏళ్ల మైనర్‌ బాలికను అత్యాచారం చేసాడని ఏపీ దిశ పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. భార్గవ్‌ మైనర్‌ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు అనగానే.. సోషల్ మీడియాను ఫాలో అవుతున్న చాలామంది ‘ఓమైగాడ్ నిత్య’పేరును తీసుకొచ్చారు.  ఈ నేపథ్యంలో ఈ విషయంపై క్లారిటీ ఇవ్వడానికి ఓ మై గాడ్ నిత్య తన సోషల్ మీడియా వేదికగా స్పందించింది.

ఈ సందర్భంగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో అప్ లోడ్ చేసిన వీడియోలో మాట్లాడుతూ.. భార్గవ్‌కు నాకు ఈ కేసుకు ఎటువంటి సంబంధం లేదని పేర్కోంది. ఆమె ఇంకా మాట్లాడుతూ.. భార్గవ్‌తో మాట్లాడి చాలా రోజులైందని.. ఫోన్‌లో కూడా మాట్లాడడం లేదని పేర్కోంది. భార్గవ్‌ని కలిసి సంవత్సరం పైనే అయ్యిందని.. నాకు కాంటాక్ట్‌లో కూడా లేడని.. ఇప్పుడు మేం కలిసి వీడియోలు కూడా చేయడం లేదని.. తెలుపుతూ మేం హైదరాబాద్‌‌లో ఉంటున్నామని తన మదర్‌తో కలిపి ఆ వీడియోలో స్పష్టతనిచ్చింది.

కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్లు తన ఫోటోను వాడారని.. ఏదో తెలియక పొరపాటున వాడుంటారని.. ఇప్పుడు క్లారిటీ ఇచ్చాను.. కనుక ఆ ఫోటోస్, మీమ్స్ వంటివి చేయకూడదని..  ఇప్పటికే చేసిన వాటిని దయచేసి డిలిట్ చేయాలనీ కోరింది.

More Related Stories