English   

సెల్ఫ్ ఐసోలేష‌న్ కు మ‌హేష్ బాబు

Mahesh Babu
2021-04-22 11:33:25

టాలీవుడ్ లో క‌రోనా క‌ల‌క‌లం సృష్టిస్తోంది. ఇప్ప‌టికే క‌రోనా కారణంగా థియేట‌ర్లు కూడా మూత ప‌డ్డాయి. మ‌రో వైపు ప‌లు సినిమా షూటింగ్ ల‌ను కూడా వాయిదా వేసుకుంటున్నారు. అంతే కాకుండా ప‌లువురు తార‌లు క‌రోనా బారిన ప‌డి చికిత్స తీసుకుంటున్నారు. ఇక మ‌రికొంద‌రు తార‌లు త‌మ స‌న్నిహితులు, త‌మ‌తో క‌లిసి ప‌నిచేసిన వారికి క‌రోనా రావ‌డంతో సెల్ఫ్ ఐసోలేష‌న్ లోకి వెలుతున్నారు. ఇప్ప‌టికే టాలీవుడ్ టాప్ హీరోల‌లో ప‌వన్ క‌ల్యాణ్ కు క‌రోనా పాజిటివ్ రావ‌డంతో ఆయ‌న చికిత్స తీసుకుని కోలుకున్నారు. మ‌రోవైపు ప్ర‌భాస్ హెయిర్ స్టైలిస్ట్ కు క‌రోనా రావ‌డంతో ప్ర‌భాస్ ఐసోలేష‌న్ కు వెళ్ళిన‌ట్టు తెలుస్తోంది. 

ఇక తాజాగా సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కూడా క్వారంటైన్ లోకి వెళ్లిన‌ట్టు తెలుస్తోంది. మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం స‌ర్కారు వారి పాట సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే మ‌హేష్ ప‌ర్స‌న‌ల్ స్టైలిస్ట్ కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింద‌ట‌. అంతే కాకుండా స‌ర్కారు వారి పాట సినిమా టీం లో న‌లుగురు టెక్నీషియ‌న్స్ క‌రోనా బారిన ప‌డిన‌ట్టు తెలుస్తోంది. దాంతో డాక్ట‌ర్ల సూచ‌న మేర‌కు మ‌హేష్ బాబు ఐసోలేష‌న్ లోకి వెళ్లిన‌ట్టు తెలుస్తోంది. అయితే స‌ర్కారు వారి పాట టీం మాత్రం యూనిట్ స‌భ్యులు క‌రోనా బారిన ప‌డిన విష‌యాన్ని భ‌య‌ట‌కు చెప్ప‌కుండా నైట్ క‌ర్ఫ్యూ కార‌ణంగానే షూటింగ్ ను వాయిదా వేసుకున్న‌మ‌ని చెబుతుంది. 

More Related Stories