English   

ఎన్టీఆర్ అట్లీ సినిమాపై క్లారిటీ వచ్చేసింది

Jr NTR
2021-04-22 14:37:45

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో తమిళ డైరెక్టర్ అట్లీ సినిమా తీయబోతున్నారని కొద్దిరోజులుగా ఫిల్మ్ నగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ లో రాబోతున్న ఎన్టీఆర్ 30 తరవాత అట్లీ సినిమా ఉంటుందని రకరకాల వార్తలు వచ్చాయి. అంతే కాకుండా అట్లీ డైరెక్షన్ లో ఎన్టీఆర్ మరియు తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ కాంబినేషన్ లో భారీ మల్టీస్టారర్ తెరకెక్కబోతుందని గుసగుసలు వినిపించాయి. అయితే ఇప్పుడు ఆ వార్తలపై క్లారిటీ వచ్చేసింది.

ఎన్టీఆర్ తో అట్లీ సినిమా చేయడంలేదని తమిళ మీడియా స్పష్టం చేసింది. ప్రస్తుతం అట్లీ బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ వర్క్ పనుల్లో బిజీగా ఉన్నాడు అంతే కాకుండా ఈ సినిమా పూర్తి చేసేవరకు వేరే సినిమా కమిట్ అవ్వకూడదని డిసైడ్ అయ్యారట. మరోవైపు ఎన్టీఆర్ కూడా కొరటాలతో తప్ప వేరే సినిమా కమిట్ అవ్వలేదు. దాంతో ఇప్పటి వరకు అట్లీ ఎన్టీఆర్ సినిమాపై వచ్చిన వార్తలన్నీ పుకార్లేనని క్లారిటీ వచ్చేసింది.

More Related Stories