English   

మరో మెగా హీరోకు కరోనా పాజిటివ్

Kalyaan Dhev
2021-04-22 15:09:02

కరోనా సెకండ్ వేవ్ ఫస్ట్ వేవ్ కంటే దారుణంగా ఉంది. వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇక సాధారణ ప్రజలతో పాటు నటీనటులు రాజకీయనాయకులు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఆ లిస్ట్ లో మరో మెగా హీరో చేరాడు. మెగాస్టార్ అల్లుడు కళ్యాణ్ దేవ్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆయనే సోషల్ మీడియాలో వెల్లడించారు.

కొన్ని కరోనా లక్షణాలు ఉండటం తో పరీక్ష చేయించుకోగా కరోనా పాజిటివ్ వచ్చిందని కళ్యాణ్ దేవ్ పేర్కొన్నారు. దాంతో ఆయన ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు వెల్లడించారు. త్వరలోనే కొలుకుంటా అనే నమ్మకం ఉందంటూ పేర్కొన్నారు. కళ్యాణ్ దేవ్ విజేత సినిమాతో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఇదిలా ఉండగా ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కరోనా బారినపడి కొలుకున్నారు. అంతే కాకుండా కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో రామ్ చరణ్, వరుణ్ తేజ్ సైతం కరోనా బారినపడి కొలుకున్నారు. ఇక ఇప్పుడు మరో మెగా హీరోకు కరోనా పాజిటివ్ రావడం ఆందోళనకరం.

More Related Stories