English   

కేటీఆర్ కు కరోనా..మెగాస్టార్ ట్వీట్

KTR
2021-04-23 12:30:01

తెలంగాణాలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కర్ఫ్యూ విధించినప్పటికీ వైరస్ వ్యాప్తి ఎక్కువగానే కనిపిస్తోంది. సాధారణ ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు సైతం కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఆ లిస్ట్ లో మంత్రి కేటీఆర్ సైతం చేరారు. కరోనా పాజిటివ్ రావడంతో హోమ్ ఐసోలేషన్ లోకి వెళుతున్నట్టు కేటీఆర్ ట్వీట్ చేశారు లక్షణాలు ఉండటం తో టెస్ట్ చేసుకోగా ఆయన కు పాజిటివ్ వచ్చిందని తెలిపారు. కేటీఆర్ కు కరోనా రావడం తో పలువురు సెలబ్రెటీలు రాజకీయనాయకులు ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో ట్వీట్ లు చేస్తున్నారు. 

తాజాగా మెగాస్టార్ చిరంజీవి కేటీఆర్ త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. "డియర్ కేటీఆర్ మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా" అంటూ మెగాస్టార్ ట్వీట్ లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా కరోనా పాజిటివ్ రావడం తో ఆయన ఫామ్ హౌస్ లో ఉండి చికిత్స తీసుకున్నారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని..అన్ని పరీక్షలు నిర్వహించగా అన్నీ నార్మల్ ఉన్నాయని డాక్టర్ ఎం వీ రావు మీడియాకు తెలిపారు. కొన్ని రోజులు రెస్ట్ తీసుకుని త్వరలోనే రోజూవారి కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు.

More Related Stories