English   

ప‌వ‌న్ రాబోయే సినిమాల రెమ్యున‌రేష‌న్స్ నిజమేనా..

Pawan Kalyan
2021-04-23 12:39:00

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌స్తుతం రాజకీయాల‌తో పాటు సినిమాల‌ను బ్యాలెన్స్ చేస్తున్నారు. అంతే కాకుండా రీఎంట్రీ త‌ర‌వాత గ్యాప్ లేకుండా సినిమాల‌ను లైన్ లో పెడుతున్నారు. వ‌కీల్ సాబ్ ఇప్ప‌టికే విడుద‌ల కాగా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అయితే ఈ సినిమాకు ప‌వ‌న్ రూ.50 కోట్ల రెమ్య‌న‌రేష‌న్ తో పాటు లాభాల్లో వాటా కింద రూ.15 కోట్లు తీసుకున్న‌ట్టు ఫిల్మ్ న‌గ‌ర్ లో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అంతే కాకుండా ప‌వ‌న్ రాబోయే సినిమాల‌కు కూడా భారీగానే పుచ్చుకుంటున్న‌ట్టు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. 

ప్ర‌స్తుతం వ‌ప‌న్ క‌ల్యాణ్ అయ్య‌ప్ప‌నుమ్ కోషియం రీమేక్ లో నటిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు ఎంఎమ్ ర‌త్నం నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం ప‌వ‌న్ రూ. 22 కోట్లు అడ్వాన్సుగా తీసుకున్నార‌ట‌. అంతే కాకుండా సినిమా థియేట్రిక‌ల్ రైట్స్ ను సైతం త‌న‌కే ఇచ్చేలా ప‌వ‌న్ ఒప్పందం చేసుకున్నార‌ట‌. ఇదిలా ఉండ‌గానే ప‌వ‌న్ క్రిష్ కాంబినేష‌న్ లో ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి  ప‌వ‌న్ ఇప్ప‌టికే రూ.15 కోట్లు అడ్వాన్స్ గా తీసుకున్నార‌ట‌. 

మ‌రోవైపు మైత్రీ బ్యాన‌ర్ పై హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాకు ప‌వ‌న్ ఓకే చెప్పారు. ఈ చిత్రం కోసం ప‌వ‌న్ రూ.30కోట్ల రెమ్యున‌రేష‌న్ తో పాటు లాభాల్లో వాటా తీసుకుంటున్న‌ట్టు టాక్. ఇదిలా ఉండ‌గా సురేంద‌ర్ రెడ్డి డైరెక్ష‌న్ లో రామ్ త‌ల్లూరి నిర్మాణంలో ప‌వ‌న్ ఓ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఈ చిత్రానికి గాను ప‌వ‌న్ రూ.40 కోట్ల రెమ్యున‌రేష‌న్ తో పాటు లాభాల్లో వాటా తీసుకుంటున్నార‌ట‌. ఇలా ఒక్కో సినిమాకు ప‌వ‌న్ రెమ్య‌న‌రేష‌న్ పై విధంగా ఉందంటూ టాలీవుడ్  లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. 

More Related Stories