English   

అఖండ ఓటీటీ రిలీజ్ కోసం అదిరిపోయే ఆఫర్

Balayya
2021-04-23 16:27:08

రోజు రోజుకు కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దాంతో ఇప్పటికే సినిమా థియేటర్లు మూతపడ్డాయి. ఇక కరోనా విజృంభన ఇప్పట్లో తగ్గుముఖం పట్టేలా కనిపించడంలేదు. దాంతో థియేటర్లు ఇప్పట్లో తెరుచుకునే పరిస్థితి కూడా లేనట్టే అనిపిస్తుంది. అయితే రిలీజ్ కు దగ్గరగా ఉన్న సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకుంటున్న సినిమాలకు ఓటీటీ నుండి భారీ ఆఫర్లు వస్తున్నట్టు ఫిల్మ్స్ నగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతే కాకుండా బాలయ్య అఖండ కోసం ఓటీటీ నుండి భారీ ఆఫర్ వచ్చినట్లు గా కూడా టాక్ వినిపిస్తోంది. బోయపాటి దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా టీజర్ ఇప్పటికే విడుదై యుట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. 

అంతే కాకుండా బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. దాంతో అఖండ పై కూడా భారీ  అంచనాలున్నాయి. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా కరోనాతో షూటింగ్ వాయిదా పడింది. అయితే ఇప్పటికే ప్రకటించినట్టుగా మే28 న సినిమా విడుదల చేయడానికి అవకాశం లేదు. ఇదిలా ఉండగా ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అఖండకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చిందట. ఓటీటీ రూ.65 కోట్ల ఆఫర్ ఇచినట్టుగా ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. ఇక డీల్ కు చిత్ర యూనిట్ కూడా మొగ్గు చూపుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక బాలయ్య ఓటీటీలోకి వస్తారా...థియేటర్ లు తెరుచుకున్నాకే వస్తారా చూడాలి.

More Related Stories