English   

సారంగ దరియా మరో రికార్డు 

Saranga Dariya
2021-04-23 17:56:47

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా నటించిన సినిమా లవ్ స్టొరీ. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ఉన్న సమయంలో కరోనా ఉధృతి మొదలయింది. దాంతో సినిమా విడుదల వాయిదా పడింది. అయితే ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదల చేసిన టీజర్ మరియు సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా సినిమా నుండి విడుదల చేసిన సారంగదరియా పాట యుట్యూబ్ ను షేక్ చేస్తోంది. ఇప్పటికే పలు రికార్థులు బ్రేక్ చేసిన సారంగదరియా తాజాగా మరో రికార్డును క్రేయేట్ చేసింది. తాజాగా ఈ పాటకు 150 మిలియన్ వ్యూవ్స్ రాగా  1.2 మిలియన్ లైక్స్ వచ్చాయి. ఈ పాటను ఫిబ్రవరి 28 న విడుదల చేయగా రెండు నెలల్లో 150 మిలియన్ వ్యూవ్స్ ను సొంతం చేసుకుంది. ఈ పాటకు సుద్దాల అశోక్ తేజ లిరిక్స్ పవన్ సిహెచ్ అందించిన స్వరాలను తోడు సాయి పల్లవి స్టెప్పులు తోడవడంతో ఈ రేంజ్ లో హిట్ అయ్యింది. ఇక ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.

More Related Stories