English   

లంగా డ్యాన్సులంటూ పీవీపీ ట్వీట్

PVP
2021-04-24 12:34:20

ప్ర‌ముఖ నిర్మాత వైసీపీ లీడ‌ర్ పీవీపీ చేసిన ట్వీట్ సంచ‌ల‌నంగా మారింది. లంగా డ్యాన్సులు వేసే హీరోలు అంటూ పీవీపీ ట్వీట్ చేయ‌డం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఓ వీడియో వైర‌ల్ అవుతోంది. ఈనెల సాయంత్రం 7గంట‌ల ప్రాంతంలో ముంబైలోని వంగానీ వంగానీ రైల్యేస్టేష‌న్ లో మ‌హిళ త‌న బాబుతో వెలుతుండ‌గా బాబు కాలు జారి రైల్వే ట్రాక్ పై ప‌డ్డాడు. అదే స‌మ‌యానికి ట్రాక్ పైకి ఓ రైలు దూసుకువ‌స్తోంది. అది గ‌మ‌నించిన ఉద్యోగి మ‌యూర్ షేక్ ప‌రిగెత్తుకుంటూ వ‌చ్చి బాలుడిని ట్రాక్ పై నుండి ఫ్లాట్ ఫామ్ పైకి తీసుకువ‌చ్చాడు. ఆ స‌మ‌యంలో క్ష‌ణంలో అత‌డు ప్రాణాల‌తో బయ‌ట‌ప‌డ్డాడు. ఇక ఈ వీడియో కాస్త సోష‌ల్  మీడియాలో వైర‌ల్ అవుతుండ‌టంతో ప‌లువురు అత‌డి ధైర్యానికి ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. 

తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ఈ వీడియోను షేర్ చేసి అత‌డి ధైర్యానికి ఓ అవార్డు ఇవ్వ‌చ్చ‌న్నారు. అంతే కాకుండా నిర్మాత పీవీపీ ఇదే వీడియోను షేర్ చేసి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ‘రియల్ హీరో బాబు, రీల్ హీరో కాదు.. లంగా డాన్సులేసే సార్లకు 50 కోట్లు.. ఈ రియల్ హీరోకి జస్ట్ జావా బైక్.. హతవిధి! మనం చేసే కొంచమైనా, కొట్టె సీటీమార్ లైనా ఇలాంటి సూపర్ హీరోస్‌కి కొడదాం బ్రదర్స్’ అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. 

ఇక ఈ ట్వీట్ ప‌వ‌న్ కల్యాణ్ ను ఉద్యేశించి చేశార‌ని ప‌లువురు కామెంట్లు చేస్తున్నారు. దాంతో ప‌ప‌న్ ఫ్యాన్స్ కూడా పీవీపీపై ఫైర్ అవుతున్నారు. హీరోల‌తో సినిమాలు చేసి వాళ్ల‌నే విమ‌ర్షిస్తావా...నిర్మాత‌గా కోట్లు సంపాదించి నువ్వు ఎంత‌మందికి స‌హాయం చేసావంటూ మండిప‌డుతున్నారు. 

More Related Stories