English   

ప్ర‌భాస్ సినిమాపై ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్ రివీల్ చేసిన నాగ్ అశ్విన్

Nag Ashwin
2021-04-24 15:50:47

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. అందులోనూ అన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం. ప్రస్తుతం ప్రభాస్ కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. 

అంతే కాకుండా ఆదిపురుష్ సినిమాలోనూ ప్రభాస్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 30 శాతం కంప్లీట్ అయ్యింది. ఇదిలా ఉండగానే రాధే శ్యామ్ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. అయితే కొన్ని సీన్లపై ప్రభాస్ కు అనుమానం ఉండటం తో వాటిని రీషూట్ చేస్తున్నారు. ఇవి ఇలా ఉండగానే ప్రభాస్ మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 

అయితే ఈ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తయ్యాక ఈ ప్రాజెక్టు మొదలు పెట్టనున్నారు. అయితే తాజాగా ఈ సినిమా గురించి నాగ్ అశ్విన్ ఓ ఇంటర్వ్యూ లో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ప్రభాస్ ఇలాంటి కథతో ఎప్పుడూ సినిమా చేయలేదని అన్నారు. సోషియో ఫాంటసీ చిత్రంగా ఈ సినిమా ఉండబోతుందని అన్నారు. అంతే కాకుండా ఈ సినిమా కోసం అంతర్జాతీయ టెక్నాలజీ తో సెట్స్ వేస్తామని అన్నారు. ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ పని చేస్తారని చెప్పారు. ఈ సినిమా తో ప్రేక్షకులకు అద్భుత ప్రపంచాన్ని చూపిస్తామని నాగ్ అశ్విన్ అన్నారు. సినిమా ఆలస్యం అవుతున్నందుకు బాధగా ఉందని...కానీ సినిమా రిలీజ్ అయ్యాక హ్యాపీగా ఫీల్ అవుతామని అన్నారు.

More Related Stories