English   

కేటీఆర్ కు కరోనా...తన సినిమాలన్నీ చూడాలంటూ సలహా ఇచ్చిన మంచు లక్ష్మి

manchu lakshmi
2021-04-24 16:25:36

తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. కొద్ది పాటి ల‌క్ష‌ణాలు ఉండ‌టంతో కేటీఆర్ క‌రోనా టెస్ట్ చేయించుకున్నారు. కాగా ఆయ‌న‌కు క‌రోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింది. దాంతో కేటీఆర్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని రాజ‌కీయ ప్ర‌ముఖులు, సెల‌బ్రెటీలు ట్వీట్లు చేస్తున్నారు. 

ఈనేప‌థ్యంలో తాజాగా న‌టి మంచు ల‌క్ష్మి కూడా కేటీఆర్ త్వ‌ర‌గా కోలుకోవాలంటూ ట్వీట్ చేసింది. అయితే మంచు ల‌క్ష్మి కాస్త భిన్నంగా త‌న స్టైల్ లో కేటీఆర్ కోలుకోవాలంటూ ట్వీట్ చేసింది. కేటీఆర్ కు మంచు ల‌క్ష్మికి ఉన్న స్నేహం కార‌ణంగా కేటీఆర్ బ‌డ్డీ మీరు త్వ‌ర‌గా కోలుకోవాలి..నా సినిమాలు అన్నీ చూడండి అంటూ ట్వీట్లో పేర్కొంది. 

ఇక మంచు ల‌క్ష్మి ట్వీట్ వైర‌ల్ అవ్వ‌డంతో నెటిజ‌న్లు వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు. కొంద‌రు నెటిజ‌న్లు మీ సినిమాలు చూడ‌టం కంటే క‌రోనాతో ఉండ‌ట‌మే బెట‌ర్ అంటూ కామెంట్ చేయ‌గా మ‌రికొంద‌రు..బ‌డ్డీ ఏంది కేటీఆర్ మీకు దోస్తా...ఒక రాష్ట్ర మంత్రి గౌర‌వం ఇవ్వ‌డం నేర్చుకోండి అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుతం మంచు ల‌క్ష్మి ప‌లు సినిమాల‌తో పాటు టీవీ షోలూ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. అంతే కాకుండా సోష‌ల్ మీడియాలోనూ మంచు ల‌క్ష్మి అభిమానుల‌కు ద‌గ్గ‌ర‌గా ఉంటారు. 

More Related Stories