English   

ఈసారి అల్లు ఫ్యామిలీపై శ్రీరెడ్డి భవిష్యవాణి

 Sri Reddy
2021-04-24 17:01:18

వివాదాస్పద నటి శ్రీరెడ్డి ఎప్పుడూ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ వివాదాస్పద పోస్టులు పెడుతుంటుంది. అప్పుడప్పుడూ కుర్రాళ్లను రెచ్చగొట్టేందుకు వయ్యారాలు వలకబోస్తుంది. ఇక మూడ్ ను బట్టి ఒక్కొక్కరిపై ఫైర్ అవుతూ పోస్ట్ లు పెడుతుంది. ఇప్పటి వరకు శ్రీరెడ్డి దగ్గుబాటి ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ అంతే కాకుండా  మరికొందరు దర్శకులు నటినటులపై కామెంట్లు చేసింది. 

ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పై అయితే తరచూ ఏదో ఒక కామెంట్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. అయితే తాజాగా శ్రీరెడ్డి అల్లు వారి ఫ్యామిలీ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏకంగా మరి కొన్ని రోజుల్లో అతడి చాప్టర్ క్లోజ్ అంటూ పేర్కొంది. శ్రీ రెడ్డి తన పోస్ట్ లో " అల్లు గాడి కెరీర్ క్లోజ్ అయిపోయే రోజు వచ్చిందని నా సిక్స్త్ సెన్స్ చెబుతోంది. నా సిక్స్త్ సెన్స్ ఎప్పుడూ తప్పు అవ్వలేదు సుమీ..నాకేం కోపంలేదురా వాడంటే ..కానీ నాకెందుకో అలా అనిపిస్తుంది. తప్పుగా అనుకోకండి. జాగ్రత్త " అంటూ శ్రీరెడ్డిభవిష్యవాణి అని యాష్ ట్యాగ్ పెట్టింది. ఇక ఈ పోస్ట్ చూసిన బన్నీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఛాన్స్ రాక చెన్నై కి పారిపోయావ్ మా హీరోను విమర్శిస్తావా అంటూ మండిపడుతున్నారు.

More Related Stories