English   

బంగార్రాజు మొదలు పెట్టనున్న కింగ్ నాగార్జున

Nagarjuna
2021-04-26 13:21:03

‘సోగ్గాడే చిన్నినాయన’మూవీలో ‘బంగార్రాజు’ గా నాగ్ అందరిని ఆకట్టుకున్నారు. ఇక ఇదే పాత్ర ఆదారంగా  మరో సినిమాను తెరకెక్కించాలని దర్శకుడు కళ్యాణ్, నాగార్జున భావించారు. ఈ సినిమాకు ‘బంగార్రాజు’ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. కానీ అనేక కారణాలవల్ల ఈ సినిమా సెట్స్ పైకి  వెళ్ళలేదు.  తాజాగా మరోసారి ఈ సినిమాకు సంబంధించిన వార్త ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా షూటింగ్ ను త్వరలోనే మొదలు పెట్టనున్నారట.  ఈ విషయం నాగ్ స్వయంగా చెప్పారు. నాగ్ మాట్లాడుతూ… ‘బంగార్రాజు’ కథనే సిద్ధం చేసుకుంటున్నాం. దర్శకుడు కల్యాణ్ కృష్ణ తో ఆన్లైన్లో మాట్లాడుతూ కథ గురించి చర్చించుకుంటున్నాం. షూటింగ్ లు మొదలు కాగానే ఆ సినిమాని మొదలు పెట్టనున్నాం అని అన్నారు.

More Related Stories