English   

ప‌వ‌న్ కళ్యాణ్  నాపై క‌విత‌లు రాసి పంపేవారు..

Actress Jyothi
2021-04-26 15:59:11

తెలుగు ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో గ్లామ‌ర్ పాత్ర‌ల‌తో గుర్తింపు తెచ్చుకున్న న‌టి జ్యోతి. హంగామా, పెళ్లాం ఊరెళితే లాంటి సినిమాల్లో కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన జ్యోతి అప్ప‌ట్లో వ‌రుస ఆఫ‌ర్ల‌తో బిజీగా ఉండేది. ఇక ప్రస్తుతం అడ‌పాద‌డ‌పా సినిమాలు చేస్తూ అల‌రిస్తోంది. అంతే కాకుండా బిగ్ బాస్ సీజ‌న్ 1 లో వ‌చ్చి ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. 

ఇదిలా ఉండ‌గా తాజాగా ఓ ఇంట‌ర్యూలో జ్యోతి ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించింది. త‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించి...సినిమా జీవితం గురించి పలు విష‌యాల‌ను పంచుకుంది. వైజాగ్ కు చెందిన జ్యోతి ప‌ద్దెనిమిదేళ్ల‌కే సినిమా అవ‌కాశాల కోసం హైద‌రాబాద్ కు వ‌చ్చింద‌ట‌. అవ‌కాశాల కోసం మొద‌ట్లో చాలా ఆఫీసుల చుట్టూ తిరిగాన‌ని జ్యోతి తెలిపింది. 

ఇక సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన త‌ర‌వాత ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాలో న‌టించే అవ‌కాశం వ‌చ్చింద‌ట‌. ఆ సినిమా షూటింగ్ స‌మ‌యంలో ప‌వ‌న్ త‌న‌పై క‌విత‌లు రాసి పంపేవార‌ని జ్యోతి వెల్ల‌డించింది. సెట్స్ లో ఉన్న‌ప్పుడు ప‌వ‌న్ త‌న‌పై స‌ర‌దాగా క‌విత‌లు రాసి పంపేవార‌ని అవి చూసి న‌వ్వుకునేదాన్నని తెలిపింది. ఇక ఫ్యూచ‌ర్ లోనూ ప‌వ‌న్ సినిమాలో న‌టించాల‌ని ఉంద‌ని పేర్కొంది. అంతే కాకుండా త‌నకు పెళ్ల‌య్యింద‌ని కానీ భ‌ర్త‌తో విడిపోయిన‌ట్టు చెప్పింది. త‌న భ‌ర్త మ‌ళ్లీ పెళ్లి చేసుకున్నార‌ని కానీ తాను బాబును చూసుకుంటూ ఒంట‌రి జీవితం గ‌డుపుతున్నాన‌ని చెప్పింది. 
 

More Related Stories