English   

పుష్ప రాజ్ కు చెల్లెలిగా టాలెంటెడ్ హీరోయిన్

Aishwarya Rajesh
2021-04-26 16:53:03

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా న‌టిస్తున్న చిత్రం పుష్ప‌. ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా ర‌ష్మిక మంద‌న న‌టిస్తోంది. క‌రోనా విజృంభ‌న స‌మ‌యంలోనూ ఈ సినిమా షూటింగ్ కు బ్రేకుల్లేకుండా షూట్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో అల్లు అర్జున్ కు విలన్ గా మ‌ల‌యాళ న‌టుడు ఫ‌హాద్ ఫాసిల్ న‌టిస్తున్నాడు. మ‌రో వైపు ఈ సినిమాలో ఐష్వ‌ర్య రాజేష్ కూడా న‌టిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే తాజా టాక్ ప్ర‌కారం ఈ చిత్రంలో ఐష్వ‌ర్య అల్లు అర్జున్ కు చెల్లెలిగా న‌టిస్తున్నార‌ట‌. 

సినిమాలో ఓ పోలీస్ ఆఫీసర్ కార‌ణంగా ఐశ్వ‌ర్య చ‌నిపోతుంద‌ట‌. దాంతో ఆ పోలీస్ ఆఫీస‌ర్ పై  అల్లు అర్జున్ ప‌గ‌తీర్చుకునే క‌థాంశం నేప‌థ్యంలో ఈ సినిమా ఉండ‌బోతుంద‌ట‌. అయితే ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేవ‌ర‌కు వేచి చూడాల్సిందే. ఇక ఇప్ప‌టికే ఈ సినిమా నుండి విడుద‌ల చేసిన ఫోటోలు మ‌రియు టీజ‌ర్ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక్ట‌టున్నాయి. పుష్ప టీజ‌ర్ ఇప్ప‌టికే 40 మిలియ‌న్స్ కు పైగా వ్యూవ్స్ ను సొంతం చేసుకుని 50 మిలియ‌న్ దిశ‌గా దూసుకుపోతుంది.  ఇప్ప‌టికే బ‌న్నీ సుకుమార్ కాంబినేష‌న్ లో వచ్చిన ఆర్య‌, ఆర్య 2 సినిమాలు మంచి విజయం సాధించ‌డంతో పుష్ప సినిమాపై అభిమానుల‌కు ఎన్నో అంచ‌నాలున్నాయి. 

More Related Stories