థియేటర్ లో డిజాస్టర్ కానీ ఓటీటీలో ఆహా అనిపిస్తుందంట

ప్రస్తుతం థియేటర్ లో విడుదలైన సినిమాలకు అక్కడ హిట్ టాక్ రాకపోయినా ఓటీటీలో సత్తా చాటుతున్నాయి. యంగ్ హీరో కార్తికేయ లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్ లు గా నటించిన సినిమా చావుకబురు చల్లగా. ఈ సినిమా మార్చి 19 విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్ లో విడుదలైన ఈ సినిమా ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. భర్త చనిపోయిన యువతిని ప్రేమించే కథాంశం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకు టాలీవుడ్ ప్రేక్షకులు కనెక్ట్ అవ్వలేదు. దాంతో ఈ సినిమా ఫ్లాప్ టాక్ ను మూటగట్టుకుంది.
ఇక ఈ సినిమా ఎప్రిల్ 23న అల్లూ వారి ఓటీటీ ఆహాలో రిలీజ్ అయింది. కాగా విడుదలైన మూడు రోజులోకే ఈ సినిమాకు 100 మిలియన్ వ్యూవ్స్ రావడం విశేషం. అంతే కాకుండా ఇప్పటికీ వ్యూవ్స్ తో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాను జీఎ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించారు. ఇదిలా ఉండగా నాగర్జున హీరోగా నటించిన వైల్డ్ డాగ్ సినిమా ఎప్రిల్ 2న థియేటర్లో విడుదలైంది. ఈ సినిమాకు కూడా మిశ్రమస్పందన లభించింది. కానీ ఓటీటీలో మాత్రం వైల్డ్ డాగ్ కు మంచి రెస్పాన్స్ వస్తున్నట్టు తెలుస్తుంది. దాదాపు ఐదు భాషల్లో విడుదలైన ఈ సినిమా ఓటీటీలో సత్తాచాటుతున్నట్టు నాగర్జున ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.