English   

ఆచార్య విడుదల వాయిదా..

Acharya
2021-04-27 11:23:13

మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న  ప్రతిష్టాత్మక చిత్రం ఆచార్య.  ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.   అయితే తాజాగా వస్తోన్నసమాచార మేరకు ఈ సినిమా వాయిదా పడ్డట్లు తెలుస్తోంది. కరోనా కారణంగా ఆచార్య కూడా వాయిదా పడిపోయిందని టాక్‌. దీనికి తోడు కొంత షూటింగ్ చేయాల్సి ఉందట. అందుకే సినిమాని చిరంజీవి పుట్టిన రోజైన ఆగస్టు 22న విడుదల చేసే ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జులై మధ్యలోనూ విడుదల చేస్తారనే మరో వార్త కూడా వినిపిస్తోంది. 

రామ్‌చరణ్‌ ప్రత్యేక పాత్రలో (సిద్ధ) నటిస్తుండగా ఆయన సరసన పూజాహెగ్డే - నీలాంబరి అనే పాత్రలో కనిపిస్తోంది. దేవాదాయ శాఖలో జరుగుతున్న అవినీతిపై పోరాటమే ప్రధాన కథాంశంగా చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే చిత్రానికి సంబంధించి టీజర్‌, ఓ పాట కూడా విడుదలై అభిమానులను ఆకట్టుకున్నాయి.

More Related Stories