పుష్ప అలా ఉండబోతుందంటున్న రష్మిక

టాలీవుడ్ బ్యూటీ రష్మిక మందన ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది. రష్మిక ఛలో సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో వరుస ఆఫర్ లను దక్కించుకుంది. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగి స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తోంది. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించిన రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సినిమాలో నటిస్తోంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా మైత్రీమూవీమేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇక అప్పుడప్పుడూ ఫ్యాన్స్ తో ముచ్చటించే రష్మిక తాజాగా మరోసారి సోషల్ మీడియా లైవ్ లోకి వచ్చి అభిమానులతో ముచ్చటించింది.
ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలు పంచుకుంది. పుష్ప సినిమా షూటింగ్ ఫుల్ స్వింగ్ పైన ఉందని చెప్పింది. అల్లు అర్జున్, మైత్రీమూవీ మేకర్స్, సుకుమార్ కాంబినేషన్ అదుర్స్ అని చెప్పింది. అంతే కాకుండా అల్లు అర్జున్ గురించి మీ ఒపీనియన్ చెప్పాలని అడగ్గా...హీ ఈజ్ సో స్వీట్ హీ ఈజ్ సో క్యూట్ అని తెలిపింది. మరో నెటిజన్ మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని ప్రశ్నించగా ఇప్పడు వర్క్ తన బాయ్ ఫ్రెండ్ అని చెప్పింది. ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నానని అలాంటి వాటికి సమయంలేదని తెలిపింది.