English   

జూన్ వరకు షూటింగ్ లకు దూరంగా పవన్ కళ్యాణ్

Pawan Kalyan
2021-04-27 13:54:01

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. క‌రోనా రావ‌డంతో ప‌వన్ ఆయ‌న ఫాం హౌస్ లోనే చికిత్స తీసుకున్నారు. చికిత్స అనంత‌రం ఆయ‌న క‌రోనా నుండి త్వ‌ర‌గానే కోలుకున్నారు. అయితే కరోనా నుండి కోలుకున్న త‌ర‌వాత కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్ పోస్ట్ కోవిడ్ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నార‌ట‌. దాంతో ఆయ‌న కు మ‌రింత విశ్రాంతి అవ‌స‌ర‌మ‌ని డాక్టర్లు సూచించినట్టు తెలుస్తోంది. 

ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌వ‌న్ భయ‌టకు రాకుండా ఫాం హౌస్ లోనే రెస్ట్ తీసుకుంటున్నారు. అంతే కాకుండా ప‌వ‌న్ మ‌ళ్లీ జూన్ వ‌రకు షూటింగ్ ల‌లో పాల్గొన‌కూడద‌ని కూడా డిసైడ్ అయ్యార‌ట‌. ఆరోగ్యం పూర్తిగా బాగుప‌డ్డాకే మ‌ళ్లీ షూటింగ్ ల‌కు వెళ్లాల‌ని డాక్ట‌ర్లు కూడా సూచించిన‌ట్టు తెలుస్తోంది. దాంతో ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా న‌టిస్తున్న అయ్య‌ప్ప‌నుమ్ కోషియం రీమేక్ మ‌రియు హ‌రిహ‌రవీర‌మ‌ల్లు సినిమాల షూటింగ్ లు జూన్ లో తిరిగి ప్రారంభం అయ్యే అవ‌కాశం ఉంది. 

ఇక ప్ర‌స్తుతం రెస్ట్ లో ఉన్న ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సేన పార్టీ రాజ‌కీయ కార్య‌క్ర‌మాల‌పై పార్టీ స‌భ్యుల‌తో వీడియో కాల్ లో స‌మావేశాలు జ‌రుపుతున్న‌ట్టు తెలుస్తుంది. అంతే కాకుండా క‌రోనా కార‌ణంగా రాష్ట్రంలో నెల‌కొంటున్న ప‌రిస్థితుల‌పై కూడా ఆయ‌న ఎప్ప‌టిక‌ప్పుడు ఆరా తీస్తున్నారు. జ‌న‌సేన అధికారిక ఖాతా ద్వారా చెప్పాల‌నుకున్న విష‌యాన్ని లేఖ రూపంలో వ‌దులుతున్నారు. 

More Related Stories