English   

నానీకి హ్యాండ్ ఇచ్చిన నజ్రియా నజీమ్

Nazriya Nazim
2021-04-27 17:35:03

మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ ప్రస్తుతం నాని హీరోగా నటిస్తున్న అంటే సుందరానికి సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే నజ్రియా భర్త ఫహద్ ఫాజిల్ కూడా అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న "పుష్ప" సినిమాలో హీరోగా నటిస్తున్నారు. అయితే ఈ రెండు సినిమా షూటింగ్ లు హైదరాబాద్ లో జరుగుతుండటంతో ఈ జంట హైదరాబాద్ కు చేరుకున్నారు. 

కాగా కరోనా విజృంభన నేపథ్యంలో పుష్ప సినిమా షూటింగ్ ను కూడా వాయిదా వేసుకున్నారు. దాంతో సినిమాలో అల్లు అర్జున్ కు విలన్ గా నటిస్తున్న ఫహద్ ఫాజిల్ తిరిగి చెన్నై కి వెళ్ళడానికి రెడీ అయ్యారు. అయితే ఫహద్ తో పాటు అతడి భార్య నజ్రియా కూడా చెన్నై కి వెళ్లేందుకు రెడీ అయ్యిందట. అంటే సుందరానికి షూటింగ్ జరుగుతున్నా..ఇలాంటి పరిస్థితుల్లో తాను షూటింగ్ లో పాల్గొనలేనని తేల్చి చెప్పిందట. ఇక నజ్రియా వెళ్లడంతో చేసేది లేక షూటింగ్ కు ఫ్యాకప్ చెప్పినట్టు తెలుస్తోంది.
 

More Related Stories