English   

అమెజాన్ లో వకీల్ సాబ్..ఆ రోజు నుండి స్ట్రీమింగ్

 Pawan Kalyan
2021-04-27 18:28:35

మూడేళ్ళ గ్యాప్ తరవాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమా వకీల్ సాబ్. ఈ సినిమాను బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన పింక్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కించారు. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించగా పవన్ కల్యాణ్ పక్కన హీరోయిన్ గా శ్రుతి హసన్ నటించింది. శ్రీవెంకటేశ్వర బ్యానర్ పై దిల్ రాజు మరియు బాలివుడ్ నిర్మాత బోణీకపూర్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. అంతే కాకుండా సినిమాలో అంజలి, నివేదిత థామస్, అనన్య కీలక పాత్రల్లో నటించారు. ఇక ఎన్నో అంచనాల మద్య ఈ ఎప్రిల్ 9న విడుదలయింది. 

ఈ చిత్రానికి మొదట వసూళ్లు భారీగానే వచ్చినా కరోనా విజృంభన నేపథ్యంలో కలెక్షన్లను బ్రేక్ పడింది. అయితే ఇప్పుడు చిత్ర యూనిట్ వకీల్ సాబ్ ను ఓటీటీ లో విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. అంతే కాకుండా సినిమా రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఎప్రిల్ 30 నుండే ఈ సినిమా అమెజాన్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. అంతే కాకుండా ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఒక ట్రైలర్ ను కూడా విడుదల చేసింది. ఇక థియేటర్ షేక్ చేసిన వకీల్ సాబ్ ఓటీటీలో ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాలి.

More Related Stories