English   

అల్లు అర్జున్ కు క‌రోనా పాజిటివ్

 Allu Arjun
2021-04-28 11:32:13

టాలీవుడ్ లో క‌రోనా డేంజ‌ర్ బెల్స్ మోగిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కూ ప‌లువురు నటీన‌టులు టెక్నీషియ‌న్ లు కరోనా బారిన ప‌డి చికిత్స తీసుకుంటున్నారు. మ‌రికొంద‌రు ఇప్ప‌టికే క‌రోనా నుండి కోలుకున్నారు. కాగా తాజాగా హీరో అల్లు అర్జున్ కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. ఈ విష‌యాన్ని అల్లు అర్జున్ సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించారు. ట్విట్ట‌ర్ ద్వారా ఆయ‌న ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. క‌రోనా పాజిటివ్ వ‌చ్చింద‌ని హోం ఐసోలేష‌న్ లో చికిత్స తీసుకుంటున్నాన‌ని బ‌న్నీ పేర్కొన్నారు. అంతే కాకుండా త‌న‌కు కాంటాక్ట్ అయిన వాళ్లు కూడా టెస్ట్ చేసుకోవాల‌ని సూచించారు. 

ప్ర‌స్తుతం త‌న ఆరోగ్యం భాగానే ఉంద‌ని ఫ్యాన్స్ ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని తెలిపారు. ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టికే అల్లు అర్జున్ తండ్రి నిర్మాత అల్లు అర‌వింద్ కు కూడా క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. ఆయ‌న క‌రోనా వ్యాక్సిన్ ఫ‌స్ట్ డోస్ తీసుకున్న త‌ర‌వాత కూడా క‌రోనా బారిన ప‌డ్డారు. మ‌రోవైపు మెగా ఫ్యామిలీ నుండి సెకండ వేవ్ సమ‌యంలో ప‌వ‌న్ క‌ల్యాన్ కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఆయ‌న క‌రోనా నుండి కోలుకుని రెస్ట్ తీసుకుంటున్నారు. మెగాస్టార్ అల్లుడు క‌ల్యాణ్ దేవ్ కు కూడా క‌రోనా పాజిటివ్ రావ‌డంతో ఆయన ఆస్ప‌త్రిలో చికిత్స తీసుకుంటున్నారు. 

More Related Stories