English   

రవితేజ మళ్ళీ రాజా ది గ్రేట్ అనిపిస్తాడా

Raja The Great
2021-04-28 13:22:13

మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ హిట్ లు లేక స‌త‌మ‌త‌మ‌వుతున్న‌ స‌మ‌యంలో వ‌చ్చిన రాజా ది గ్రేట్ సినిమా సూప‌ర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో ర‌వితేజ మ‌ళ్లీ ట్రాక్ మీద‌కు వ‌చ్చాడు. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి ద‌ర్శ‌కత్వం వహించారు. అయితే ఈ సినిమా త‌ర‌వాత మ‌ళ్లీ వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో సినిమా అనుకున్నారు కానీ అది జ‌ర‌గ‌లేదు.  

కాగా ఇప్పుడు వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో మ‌రో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట‌. అది కూడా సూప‌ర్ డూప‌ర్ హిట్ గా నిలిచిన రాజా ది గ్రేట్ సినిమాకు సీక్వెల్ చేయాల‌నే ఆలోచ‌న‌లో అనిల్ రావిపూడి ఉన్నాడ‌ట‌. అంతే కాకుండా ఇప్ప‌టికే ర‌వితేజ కు స్టోరీలైన్ వినిపించ‌గా ర‌వితేజ కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశార‌ట‌. దాంతో ప్ర‌స్తుతం అనిల్ రావిపూడి పూర్తి స్క్రిప్ట్ ను సిద్దం చేసే పనిలో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇక అంతా అనుకున్న‌ట్టు జ‌రిగితే రాజా ది గ్రేట్ కు సీక్వెల్ త్వ‌ర‌లోనే రానుంది. 

ఇదిలా ఉండ‌గా క్రాక్ తో సూప‌ర్ హిట్ కొట్టిన ర‌వితేజ ప్ర‌స్తుతం ఖిలాడి సినిమాలో న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం క‌రోనా విజృంభ‌న‌తో సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. ఈ సినిమాను యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంపై కూడా భారీ అంచ‌నాలున్నాయి. ఇక ఈ సినిమా త‌ర‌వాత ర‌వితేజ న‌క్కిన త్రినాథ‌రావు ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఇక అనిల్ రావిపూడి విష‌యానికొస్తే  ప్ర‌స్తుతం ఎఫ్ 3 సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. దాదాపు షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమాకు కూడా క‌రోనా కార‌ణంగా బ్రేక్ పడింది. ఇక‌ ఈ సినిమా త‌ర‌వాత బాల‌య్య‌తో ఓ సినిమా చేయ‌బోతున్నారు. ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కించ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. 

More Related Stories