English   

కరోనా నుండి కోలుకున్న అనిల్ రావిపూడి

Anil Ravipudi
2021-04-28 14:47:41

టాలీవుడ్ నిర్మాత అనిల్ రావిపూడి క‌రోనా నుండి కోలుకున్నారు. అయితే అనిల్ రావిపూడికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన‌ట్టు కొద్దిరోజులుగా వార్తలు వ‌స్తున్నా ఆయ‌న స్పందించ‌టేదు. ఇక తాజాగా ఎప్రిల్ 13న ఆయ‌న‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింద‌ని ఈరోజు టెస్ట్ చేసుకోగా నెగిటివ్ వ‌చ్చింద‌ని తెలిపారు. క‌రోనా వ‌చ్చిన నాటి నుండి హోం ఐసోలేష‌న్ లోనే చికిత్స తీసుకున్నాన‌ని తెలిపారు. త‌న‌తో కాంటాక్ట్ అయిన‌వారు కూడా క‌రోనా టెస్ట్ చేసుకోవాల‌ని సూచించిన‌ట్టు తెలిపారు.

ప్ర‌తిఒక్క‌రూ క‌రోనా వ్యాక్సిన్ వేసుకోవాల‌ని జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా అనిల్ రావిపూడి ప్ర‌స్తుం ఎఫ్ 3 సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. ఎఫ్ 2 కు సీక్వెల్ గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ను శ‌ర‌వేగంగా పూర్తిచేస్తున్నారు. ఇక ఈ సినిమా త‌ర‌వాత బాల‌య్య‌తో ఓ సినిమా చేయ‌బోతున్నారు. ఇప్ప‌టికే బాల‌క్రిష్న‌కు క‌థ చెప్పాగా ఆయ‌న గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ సినిమాలో బాల‌య్యను నెవ్వ‌ర్ బిఫోర్ రోల్ లో చూపించ‌బోతున్నాన‌ని ఓ ఇంట‌ర్యూలో అనిల్ రావిపూడి చెప్పారు. 

More Related Stories