English   

బాల‌య్య రెమ్యున‌రేష‌న్ అంత త‌క్కువా

 Balakrishna
2021-04-28 15:50:18

ప్ర‌స్తుతం టాలీవుడ్ హీరోలు ఒక్కో సినిమాకు భారీగానే వ‌సూలు చేస్తున్నారు. టాప్ హీరోలంగా రూ.50 నుండి రూ.70 కోట్ల వ‌ర‌కూ పుచ్చుకుంటున్న‌ట్టు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా యావ‌రేజ్ హీరోలు అయితే దాదాపు రూ.10 కోట్ల రెమ్యున‌రేష‌న్ పుచ్చుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. కానీ సీనియ‌ర్ హీరోల రెమ్యున‌రేష‌న్ లు మాత్రం చాలా త‌క్కువ‌గా ఉన్న‌ట్టు తెలుస్తోంది. అయితే ఇందులో మెగాస్టార్ చిరంజీవి మాత్రం యంగ్ హీరోల‌కు స‌మానంగా పుచ్చుకుంటున్నార‌ట‌. 

కానీ నాగార్జున‌, వెంక‌టేశ్, బాల‌క్రిష్ణ చాలా త‌క్కువ రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. ఇక వారిలో నాగార్జున ఒక సినిమాకు రూ.5 నుండి 6 కోట్లు మాత్రమే పుచ్చుకుంటున్నార‌ట‌. ఇక న‌ట‌సింహం నంద‌మూరి బాల‌క్రిష్ణ కూడా రూ.7 కోట్లు మాత్ర‌మే తీసుకుంటున్నార‌ట‌. ప్రస్తుతం బాల‌క్రిష్ణ న‌టిస్తున్న అఖండ సినిమాకు కూడా రూ.7 కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకుంటునట్టు తెలుస్తోంది. 

నిజానికి ఈ సినిమా టీజ‌ర్ ఇప్ప‌టికే యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. టీజ‌ర్ కు వ‌స్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఈ సినిమాకు క‌లెక్ష‌న్ల వ‌ర్షం  కుర‌వ‌డం కాయమ‌నిపిస్తుంది. మ‌రి సినిమా మంచి విజ‌యం సాధించి క‌లెక్ష‌న్లు భారీగా రాబడితే బాలక్రిష్ణ లాభాల్లో వాటా పుచ్చుకుంటారా..లేదంటే ముందుగా మాట్లాడుకున్న రెమ్యున‌రేష‌న్ తోనే స‌రిపెట్టుకుంటారా చూడాలి. 

More Related Stories