English   

మెగాస్టార్ కు కథ చెప్పిన అర్జున్ రెడ్డి డైరెక్టర్

Sandeep Reddy
2021-04-28 17:01:08

అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నివడమే కాకుండా నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అనిపించుకుంది. ఇక ఈ సినిమా తరవాత సందీప్ రెడ్డి అదే సినిమాను బాలీవుడ్ లో తీసి హిట్ కొట్టాడు. "కబీర్ సింగ్" పేరుతో తెరకెక్కించిన ఈ సినిమాలో షాహిద్ కపూర్ లాంటి స్టార్ హీరోగా నటించాడు. దాంతో మనోడి టాలెంట్ కు ఫిదా అయిన బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ "యానిమల్" అనే సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. రణ్వీర్ సింగ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం పై ఎన్నో అంచనాలున్నాయి. అయితే టాలీవుడ్ లోనూ మహేష్ బాబుకు సందీప్ కథ చెప్పినట్టుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటివరకు దానిపై క్లారిటీ లేదు. అయితే ఇప్పుడు మెగాస్టార్ హీరోగా సందీప్ ఓ సినిమా చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఇప్పటికే మెగాస్టార్ కు సందీప్ రెడ్డి కథను వినిపించారట. మరి మెగాస్టార్ ఒకే చెబుతారా లేదా అన్నది చూడాలి.

More Related Stories