English   

బెల్లంకొండ చేతికి మరో బ్లాక్ బస్టర్ రీమేక్ రైట్స్

 Bellamkonda Sreenivas
2021-04-29 16:17:28

బెల్లంకొండ సురేష్ తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఫస్ట్ సినిమా నే టాప్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో చేసాడు. "అల్లుడు శ్రీను" అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో వచ్చిన ఈ సినిమాలో హీరోయిన్ గా సమంత హీరోయిన్ గా నటించింది. అంతే కాకుండా ఈ సినిమాలో తమన్నా ఐటెమ్ సాంగ్ లో నటించింది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో శ్రీనివాస్ కు గుర్తింపు వచ్చింది. ఈ సినిమా తరవాత వరుసపెట్టి సినిమాలు చేసినప్పటికీ హిట్ అయినవి తక్కువే అని చెప్పాలి. చివరగా   అల్లుడు అదుర్స్ సినిమాతో బెల్లం కొండ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కూడా అనుకున్నమేర విజయం సాధించలేకపోయింది. 

ఇక ఇప్పుడు ఏకంగా టాలీవుడ్ లో సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన ఛత్రపతిని రీమేక్ తో బాలీవుడ్ కి పరిచయం అవబోతున్నాడు. అంతే కాకుండా తాజాగా శ్రీనివాస్ మరో సినిమా రీమేక్ రైట్స్ ను సొంతం చేసుకున్నారు. తమిళ హీరో ధనుష్ నటించిన "కర్ణన్" బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రానికి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. ఎప్రిల్ 9 న విడుదలైన ఈ చిత్రానికి కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఇక తాజా సమాచారం ప్రకారం బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్నారట. దీనిపై పూర్తి వివరాలు త్వరలోనే రానున్నాయి.

More Related Stories