English   

క‌రోనా బాధితుల కోసం రంగంలోకి మెగాస్టార్

chiru
2021-05-03 12:54:03

క‌రోనా మ‌హ‌మ్మారి డేంజ‌ర్ బెల్స్ మోగిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య వేంగంగా పెరుగుతోంది. ఇత‌ర రాష్రాల‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ క‌రోనా కేస‌లు ఎక్కువ‌గానే న‌మోద‌వుతున్నాయి. కేసులు పెర‌గ‌టంతో పాటు మ‌ర‌ణాల సంఖ్య కూడా పెరుగుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తుంది. క‌రోనా ఫ‌స్ట్ వేవ్ స‌మ‌యంలో క‌రోనా వ్యాప్తి త‌క్క‌వ ఉన్నప్ప‌టికీ సెకండ‌వేవ్ స‌మ‌యంలో మాత్రం ప‌రిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఇక సీరియ‌స్ పేషెంట్ ల‌ను ర‌క్షించ‌డానికి చేసే ప్లాస్మా థెర‌పీ కోసం ప్లాస్మా కొర‌త ఏర్పడిన‌ట్టు తెలుస్తోంది. దాంతో టాలీవుడ్ సెల‌బ్రెటీలు రంగంలోకి దిగి ప్లాస్మా దానం చేయాల‌ని కోరుతున్నారు. 

తాజాగా మెగాస్టార్ చిరంజీవి త‌న అభిమానుల‌కు ప్ర‌జల‌కు ప్లాస్మా దానం చేయాల‌ని పిలుపునిచ్చారు. ఈ మేర‌కు చిరు ట్వీట్ చేశారు.  ట్వీట్ లో...సెకండ్ వేవ్ లో క‌రనా ఎక్కువ‌గా పెరుగుతున్నార‌ని మ‌నం చూస్తున్నాం. అంతే కాకుండా క‌రోనా తో మ‌ర‌ణిస్తున్న‌వారిని కూడా ఎక్కువ‌గా చూస్తున్నాం. అలాంటి వారిని ఆదుకునేందుకు ముందుకు రావాల్సిన స‌మ‌య‌మిది. మీరు క‌రోనా నుండి కొద్ది రోజుల క్రిత‌మే కోలుకుని ఉంటే మీ ప్లాస్మాను డొనేట్ చేయండి. దీనివ‌ల్ల మ‌రొక‌రు క‌రోనా నుండి కోలుకుంటారు. నా అభిమాల‌నులు కూడా ప్ర‌త్యేకించి ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొనాల‌ని కోరుకుంటున్నాను. ప్లాస్మా డొనేష‌న్ వివ‌రాల‌కు సూచ‌న‌ల‌కు చిరంజీవి చారిట‌బుల్ ట్ర‌స్ట్ ఆఫీస్ ని సంప్ర‌దించండి. ఫోన్ నంబ‌ర్ 040-23554849, 9440055777 అంటూ పేర్కొన్నారు.

More Related Stories