English   

తమిళస్టార్ ను లైన్ లో పెట్టిన దిల్ రాజు..దర్శకుడు ఎవరంటే

Thalapathy Vijay Dil Raju
2021-05-03 15:35:12

వకీల్ సాబ్ విజయంతో నిర్మాత దిల్ రాజు ఫుల్ జోష్ మీద ఉన్నారు. ఈ సినిమా పై కరోనా ఎఫెక్ట్ పడటంతో ఎక్కువ రోజులు థియేటర్ లో నిలవలేకపోయింది. కానీ సినిమాకు ఫస్ట్ వీక్ లోనే భారీ కలెక్షన్స్ వచ్చినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా లాభాలు కూడా వచ్చాయని దిల్ రాజు ప్రెస్ మీట్ లో వెల్లడించారు. ఇదిలా ఉండగా దిల్ రాజు ఇప్పటికే చరణ్ హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తో ఓ సినిమా సెట్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా పై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. ఇదిలా ఉండగానే మరో క్రేజీ ప్రాజెక్టును దిల్ రాజు లైన్ లో పెడుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. అందులో హీరోగా తమిళ స్టార్ హీరో తలపతి విజయ్ నటిస్తున్నారట. అంతే కాకుండా ఈ చిత్రానికి టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాను తమిళ్ తో పాటు తెలుగులో ఒకేసారి చిత్రించబోతున్నారు. ఇప్పటికే విజయ్ నటించిన సినిమాలు తెలుగులో డబ్ కావడంతో అతడు తెలుగు ప్రేక్షకులకు సూపరిచితుడే కాగా ఈ సినిమాతో మరింత దగ్గరకానున్నారు.

More Related Stories