English   

కంగ‌నాకు షాకిచ్చిన ట్విట్ట‌ర్..ఘాటుగా స్పందించిన‌ ఫైర్ బ్రాండ్

Kangana Ranaut
2021-05-04 15:06:09

బాలీవుడ్ బ్యూటీ కంగ‌నా ర‌నౌత్ కు ట్విట్ట‌ర్ షాక్ ఇచ్చింది. ఫైర్ బ్రాండ్ అధికారిక ఖాతాను ప‌ర్మినెంట్ గా తొల‌గిస్తూ సంచ‌ల‌న నిర్న‌యం తీసుకుంది. కంగ‌నా వ‌రుస‌గా రెచ్చ‌గొట్టే పోస్టుల‌ను పెడుతున్నందుకుగానూ ఆమె ఖాతాను పూర్తిగా తొల‌గిస్తున్న‌ట్టు పేర్కొంది. ఇదిలా ఉండ‌గా కంగ‌నా ప్ర‌స్తుతం ప‌శ్చిమ్ బెంగాల్ లో జ‌రుగుతున్న దాడుల గురించి వ‌రుస పోస్టుల‌ను పెడుతుంది. ఈ నేప‌థ్యంలోనే ఆమె ఖాతాను తొలగించార‌ని ఆరోప‌ణలు వ‌స్తున్నాయి. అంతే కాకుండా తానా తొల‌గింపుపై కంగ‌నా ర‌నౌత్ స్పందించింది. 

త‌న ట్విట్ట‌ర్ ఖాతాను మంగ‌ళవారం తొల‌గించారని తెలిపింది. అయినా నా గొంతు వినిపించ‌డానికి ఇత‌ర సోష‌ల్ మీడియా నెట్ వ‌ర్క్ లు ఉన్నాయ‌ని తెలిపింది. ట్విట్ట‌ర్ అమెరిక‌న్ల‌దని వాళ్లద‌ని అంటే తెల్ల రంగు క‌లిగిన వాళ్ల‌ని వాళ్లు ఎప్పుడూ గోదుమ‌రంగు చ‌ర్మం క‌లిగిన‌వాళ్లని నియంత్రించాల‌ని చూస్తుంటార‌ని పేర్కొంది. ఏం మాట్లాడోలో ఏం మాట్లాడ‌కూడ‌దో కూడా వాళ్లే డిసైడ్ చేస్తార‌ని కంగ‌నా పేర్కొంది. అదృష్ట‌వ‌శాత్తు నా గొంతు వినిపించ‌డానికి ఇత‌ర వేధిక‌లు ఉన్నాయ‌ని తెలిపింది. సినిమాల ద్వారా కూడా నా గొంతును వినిపిస్తాను. దేశ ప్ర‌జ‌ల‌కోసం నా హృద‌యం భ‌య‌లు దేరుతుంది. అంటూ వ్యాఖ్య‌లు చేసింది. ఇదిలా ఉండ‌గా గ‌తంలో కూడా కంగ‌న అకౌంట్ ను ట్విట్ట‌ర్ ప‌రిమిత స‌మ‌యం వ‌ర‌కూ నిలిపివేసింది. ఇప్పుడు ఏకంగా శాశ్వ‌తంగా బ్యాన్ చేసింది. 

More Related Stories