English   

బేబమ్మకు తెలుగులో డబ్బింగ్‌ చెప్పుకోవాలని ఉందట 

krithi shetty
2021-05-05 12:49:49

‘ఉప్పెన’తో భారీ విజయం అందుకున్న కృతిశెట్టి.. వరుస ఆఫర్లు దక్కించుకుంటూ బిజీగా మారింది. ప్రస్తుతం ఈ బ్యూటీ నాని హీరోగా తెర‌కెక్కుతోన్న శ్యామ్ సింగ రాయ్‌తో పాటు.. సుధీర్ బాబు న‌టిస్తోన్న ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాల్లో న‌టిస్తోంది. అలాగే తెలుగు, తమిళ భాషల్లో ఎనర్జిటిక్ హీరో రామ్ నటిస్తున్న మాస్ ఎంటర్‌టైనర్ సినిమాలో నటించే అవకాశం అందుకుంది.

ఇదిలా ఉంటే తాజాగా సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించిన ‘బేబమ్మ’.. పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. మీకు ఉన్న కోరిక ఏంటని ఓ అభిమాని ప్రశ్నించగా.. తనకు తెలుగులో డబ్బింగ్‌ చెప్పుకోవాలని ఉందని చెప్పింది. ఆ కోరిక నెరవేర్చే దర్శకుడి కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పింది. తనకు టాలీవుడ్‌ బాగా నచ్చిందని, తెలుగు ప్రేక్షకులు తనపై చూపే ప్రేమ, అభిమానానికి చాలా సంతోషంగా ఉన్నానని చెప్పుకొచ్చింది. మరి ‘బేబమ్మ’ కోరిక నెరవేర్చే దర్శకుడు ఎవరో చూడాలి.

More Related Stories