English   

ఏడుపోస్తోంది రాహుల్...అష్షు రెడ్డి ఎమోషనల్

Ashu Reddy
2021-05-05 14:48:02

బిగ్ బాస్ బ్యూటీ అష్షు రెడ్డి బిగ్ బాస్ విన్న‌ర్ రాహ‌ల్ ల ఫ్రెండ్ షిప్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన‌వ‌స‌రం లేదు. రాహుల్ సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ ఫేమ్ తోనే హౌస్ లో అడుగుపెట్టిన రాహుల్ ఏకంగా టైటిల్ ను గెలుచుకుని విన్నర్ గా నిలిచాడు. ఇక హౌస్ లో ఉన్నప్పుడు పునర్నవి తో నడిపిన లవ్ ట్రాక్ తోనే మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీకి ఎంతోమంది ఫ్యాన్స్ అయ్యారు. హౌస్ నుండి భయటకు వచ్చాక కూడా ఇద్దరు పలు షోలలో సందడి చేశారు. అయితే ఆ తరవాత మాత్రం ఎందుకో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ఇదిలా ఉండగా ఆ తరవాత సోషల్ మీడియాతో పాపులారిటీ సంపాదించిన బిగ్ బాస్ బ్యూటీ అష్షు రెడ్డి కి రాహుల్ దగ్గరయ్యారు. 

అప్పటి నుండి రాహుల్ అష్షు సోషల్ మీడియాలో పోస్ట్ లతో సందడి చేయడం..ఇంటర్వ్యూలకు కలిసి వెళ్లడం చేస్తున్నారు. అంతే కాకుండా ఇద్దరి మధ్య ఏదో ఉందనే అనుమానం వచ్చేలా ఇద్దరూ పోస్ట్ లు పెడుతుంటారు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాహుల్ అష్షు అంటే తనకు ఎంత ఇష్టమో చెప్పాడు. అష్షు తన బెస్ట్ ఫ్రెండ్ అని తనకు 10 వేలు డబ్బు అవసరమై అడగగా అష్షు క్షణాల్లో పంపించిందని చెప్పాడు. తాను   ఎవరిని డబ్బులు అడగనని అష్షు తో ఉన్న క్లోజ్ నెస్ కారణంగానే అడిగానని చెప్పాడు. ఇక అష్షు రాహుల్ వీడియోను షేర్ చేసి ఎమోషనల్ అయ్యింది. థాంక్యూ నేను ఏడుస్తున్నా...నువ్వు నాకు చాలా స్పెషల్ అంటూ అష్షు పేర్కొంది.
 

More Related Stories