English   

అత్తింటిపై సూరేఖావాణి సంచనలన ఆరోపణలు

Surekha Vani
2021-05-05 16:22:28

ఎన్నో సినిమాల్లో వ‌దిన‌, అక్క పాత్ర‌లు చేసి గుర్తింపు తెచ్చుకున్న న‌టి సురేఖ వాణి. ఇప్పుడంటే టాలీవుడ్ లో సీనియ‌ర్ హీరోయిన్ లు అక్క వ‌దిన పాత్ర‌లు చేస్తున్నారు గానీ ఇంత‌కాలం సురేఖ‌వాణి హ‌వా నడించింది. ఇక ఆఫ‌ర్లు త‌గ్గ‌డం తో సురేఖ ప్ర‌స్తుం సోష‌ల్ మీడియాలోనే ఎక్కువ కాలం గ‌డుపుతూ ర‌చ్చ‌చేస్తోంది. కాగా తాజాగా ఆలీతో జాలీగా షోకి న‌టి ర‌జిత తో క‌లిసి వ‌చ్చిన సురేఖ సంచ‌ల‌న విష‌యాలు భ‌య‌ట‌పెట్టింది. ఆలీ అడిగిప‌న ప‌లు ప్ర‌శ్నల‌కు సురేఖ స‌మాధానాలు చెప్పింది. 

అలీ మాట్లాడుతూ మీరు త్వ‌రలో పెళ్లి చేసుకోబోతున్నార‌ట‌.. అంటూ ప్ర‌శ్నించ‌గా సురేఖ వాని మాట్లాడుతూ.. చేసుకునేది ఎవరో కూడా వెబ్ సైట్ వాళ్ళే చెప్పాలని సమాధానం ఇచ్చింది. ఇక ఎలాంటి వాణ్ణి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు అని ప్రశ్నించగా ఫుల్ గా డబ్బులు ఉన్నోడు అయితే బెట‌ర్ చేసుకుంటా అంటూ స‌మాధానం ఇచ్చింది. మ‌న‌సు ఉన్నోడు వ‌ద్దా అని అడ‌గ్గా మ‌న‌సేంచేసుకుంటామంటూ చెప్పుకొచ్చింది. 

అంతే కాకుండా త‌న అత్తింటి వారితో ప్ర‌స్తుతం సంబంధాలు లేవ‌ని తాను త‌న కూతురు ఎంతో క‌ష్ట‌ప‌డి ఈ స్థాయికి వ‌చ్చామ‌ని తెలిపింది. త‌న భ‌ర్త అనారోగ్యంతో ఉన్న‌ప్పుడు కూడా అత్తింటి వారు ఎలాంటి స‌హాయం చేయ‌లేద‌ని...క‌నీసం చూడ్డానికి కూడా రాలేద‌ని చెప్పింది. పైగా త‌న కూతురుపై త‌న‌పై నింధ‌లు వేసారంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఇక త‌న భ‌ర్త ర‌క్తం గ‌డ్డ క‌ట్ట‌డం వ‌ల్ల చికిత్స చేయించినా ఒక నెల త‌ర‌వాత చ‌నిపోయార‌ని చెప్పింది. 

More Related Stories