English   

రాష్ట్ర ప్రభుత్వాలకు నమ్రత సలహా

Namrata Shirodkar
2021-05-05 17:23:49

కరోనా ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ ఎక్కువ ప్రమాదకరంగా ఉంది. దేశంలో రోజుకు మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా కేసులు పెరగటం తో పాటు మరణాల సంఖ్య కూడా పెరగటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వాలు కరోనా కేసులు తగ్గడంతో లైట్ తీసుకున్నారు. అయితే కరోనా సెకండ్ వేవ్ రూపంలో వచ్చి కలకలం సృష్టిస్తోంది. ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతుంది. ఈ నేపథ్యంలో మళ్లీ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసారు. 

అయితే తాజాగా మహేష్ బాబు సతీమణి నమ్రత ఓ ఇంట్రెస్టింగ్ ఫోటోను షేర్ చేసి రాష్ట్ర ప్రభుత్వాలకు సలహా ఇచ్చింది. "భోపాల్ మరియు ముంబై లో సీనియర్ సిటిజన్ లకు కార్లో కూర్చున్నప్పుడే వ్యాక్సిన్ ఇస్తున్నారు. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు.అన్ని రాష్ట్రాలు సీనియర్ సిటిజెన్ లకు ఇలానే వ్యాక్సిన్ ఇవ్వాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వ్యాక్సిన్ ఒక్కటే కరోనా నుండి కాపాడుతుంది. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలి" అంటూ నమ్రత పేర్కొంది.  ప్రస్తుతం వ్యాక్సిన్ కోసం సీనియర్ సిటిజెన్ లు వ్యాక్సిన్ కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు. అలా క్యూలో నిలుచుంటే కరోనా బారిన పడే ప్రమాదం ఉంది. అంతే కాకుండా ఎక్కువసేపు వాళ్ళు నిలుచో లేరు. ఈ నేపథ్యంలోనే నమ్రత మంచి సలహా ఇచ్చింది. మరి రాష్ట్ర ప్రభుత్వాలు నమ్రత సలహా ను పాటిస్తాయా లేదా చూడాలి.

More Related Stories