English   

ర‌వితేజ ఖిలాడీ రిలీజ్ వాయిదా

Khiladi release
2021-05-06 11:56:38

క‌రోనా సెకండ్ వేవ్ తీవ్ర రూపం దాలుస్తున్న నేప‌థ్యంలో మాస్ మహారాజా ర‌వితేజ న‌టిస్తున్న మూవీని కూడా పోస్ట్ పోన్ చేశారు.`క్రాక్‌` బ్లాక్ బ‌స్ట‌ర్‌తో మ‌ళ్లీ ట్రాక్‌లోకి వ‌చ్చిన ర‌వితేజ ఈ మూవీ ఇచ్చిన స‌క్సెస్ కార‌ణంగా రెట్టించిన ఉత్సాహంతో యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `ఖిలాడీ`ని ప‌ట్టాలెక్కించారు. ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో కోనేరు స‌త్య‌నారాయ‌ణ నిర్మిస్తున్న ఈ మూవీ రిలీజ్‌ని వాయిదా వేశారు. ముందు ఈ మూవీని ఈ నెల 28న రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేశారు. కానీ ప్ర‌స్తుతం క‌రోనా సెకండ్ వేవ్ తీవ్ర రూపం దాలుస్తున్న నేప‌థ్యంలో ఈ మూవీ రిలీజ్‌ని వాయిదా వేస్తున్న‌ట్టు చిత్ర బృందం బుధ‌వారం అధికారికంగా ప్ర‌క‌టించింది.

ఖిలాడి విషయానికొస్తే.. ఈ సినిమాలో  రవితేజ సరసన డింపుల్ హయతితో పాటు మీనాక్షి చౌదురి హీరోయిన్స్‌గా నటించారు. అనసూయ మరో కీలక పాత్రలో కనిపించనుంది.ఈ చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్‌లో నటించాడా ? ఒకడే ఇద్దరిగా ప్రవర్తించాడా అనేది ఆసక్తికరంగా ఉంది. . రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. పెన్ మూవీస్ నిర్మిస్తోంది. యాక్షన్ కింగ్ అర్జున్ ప్రతి నాయకుడి పాత్రలో నటిస్తున్నారు.

More Related Stories