English   

కరోనా వేళ గొప్ప మనసు చాటుకున్న అడవి శేష్

Adivi Sesh
2021-05-06 12:18:00

కరోనా ఉధృతి నేపథ్యంలో టాలీవుడ్ హీరోలు ఏదో ఒక రూపంలో సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే ఎక్కువమంది హీరోలు ,నిర్మాణ సంస్థలు మాత్రం సోషల్ మీడియాలో మందులు, ఆక్సిజన్ అవసరాలను షేర్ చేస్తుండగా అతి తక్కువ మంది హీరోలు నేరుగా రంగంలోకి దిగి  సహాయ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 

తాజాగా టాలీవుడ్ హీరో అడవి శేష్ సైతం కరోనా బాధితులకు సహాయం చేసి తన ఉదారత చాటుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని కోవిడ్ ఆస్పత్రిలో పేషంట్ లు తాగు నీటి సమస్యతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో శేష్ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపించారు. బుధవారం 865 లీటర్ల నీటిని పంపిన శేష్ గురువారం ఏకంగా నీటి శుద్దీకరణ యంత్రాన్ని ఏర్పాటు చేయించారు. ఈ యంత్రం ద్వారా గంటకు 1000 లీటర్ల నీరు అందుతుంది. అంతే కాకుండా శేషు తీసుకున్న నిర్ణయంతో ఎప్పటి నుండో ఉన్న సమస్యకు పరిష్కారం లభించింది. ఇదిలా ఉండగా ఇటీవలే హీరో సందీప్ కిషన్ కరోనాతో మరణించిన వారి పిల్లల బాగోగులు చూసుకుంటానని ప్రకటించారు. తాను తన టీమ్ తో కలిసి అనాథలను చేరదీస్తామన్నారు.

More Related Stories