English   

హాట్ హీరోయిన్ ఓటిటి టాకీస్

Namitha
2021-05-06 15:58:23

కరోనా వచ్చినప్పటి నుండి ఓటిటిలకు ప్రాధాన్యత పెరిగిపోయింది. జనాలు కూడా లాక్డౌన్ సమయంలో పూర్తిగా ఓటిటిలకే అలవాటు పడిపోయారు. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో ఓటిటిలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు డిమాండ్ పెరగడంతో కొత్తగా ఓటిటిలు ప్రారంభం అవుతున్నాయి. తాజాగా సౌత్ హీరోయిన్ నమిత కూడా 'నమిత టాకీస్' అనే పేరుతో ఓటిటి ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ సందర్బంగా నమిత మాట్లాడుతూ.. 'మా ఓటిటి ద్వారా చిన్న - మీడియం బడ్జెట్ సినిమాలకు రిలీజ్ చేసుకునే అవకాశం ఇవ్వనున్నాం.

కొత్తగా ఇండస్ట్రీలో అడుగు పెడుతున్న దర్శకులు - నటులకు ఇది మంచి ప్లాట్ ఫామ్. ఖచ్చితంగా నూతన టాలెంట్ ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఓటిటిని ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఎప్పుడు స్ట్రీమింగ్ స్టార్ట్ చేస్తారనేది చెప్పలేదు. కానీ త్వరలోనే ఫస్ట్ రిలీజ్ ప్రకటిస్తామని" ఆమె చెప్పింది. 

More Related Stories