English   

కేవీ గుహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఆనంద్ దేవ‌ర‌కొండ హైవే

Anand Devarakonda
2021-05-06 16:16:30

కేవీ గుహ‌న్ 118 చిత్రంతో ద‌ర్శ‌కుడిగా మారి మొద‌టి సినిమాతోనే సూప‌ర్‌హిట్ సాధించారు. ప్ర‌స్తుతం కేవీ గుహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఆనంద్ దేవ‌ర‌కొండ హీరోగా శ్రీ ఐశ్వ‌ర్య ల‌క్ష్మీ మూవీస్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.2గా రూపొందుతోన్న చిత్రం `హైవే`.  రోడ్ జ‌ర్నీ .నేప‌థ్యంలో సైకో కిల్ల‌ర్ క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి వెంక‌ట్ త‌లారి నిర్మాత‌. ఈ చిత్రం హైద‌రాబాద్ సంస్థ కార్యాల‌యంలో పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభమైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి తుంగ‌తుర్తి ఎంఎల్ఎ గాద‌రి కిశోర్‌కుమార్ క్లాప్ కొట్టగా  ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎం.వీర‌భ‌ద్రం కెమెరా స్విచాన్ చేశారు. మొద‌టి స‌న్నివేశాన్ని హీరో ఆనంద్‌దేవ‌ర‌కొండ‌పై చిత్రీక‌రించారు ద‌ర్శ‌కుడు కేవీగుహ‌న్‌. సైమ‌న్ కె.కింగ్ సంగీత సార‌థ్యం వ‌హిస్తున్న ఈ మూవీ రెగ్యుల‌ర్‌షూటింగ్ జూన్ ఫ‌స్ట్ వీక్ నుండి ప్రారంభం కానుంది.

More Related Stories